ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను

Entho Bhaagyambu

Telugu Christian Songs

Writer/Singer

Telugu Christian Songs

ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను
మనకెంతో భాగ్యంబు
వింతైన తన మహిమనంత విడచి
మన కొరకై చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో||

పరలోకమును విడచి మనుజ కుమారుడవయ్యె
నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో||

బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే
ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే ||ఎంతో||

పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు
పరమేశుని దయయందు నరుల కనికరమందు ||ఎంతో||

Entho Bhaagyambu Shree Yesu Dorikenu
Manakentho Bhaagyambu
Vinthaina Thana Mahimanantha Vidachi
Mana Korakai Chinthalanniyu Baaputakentho Deenudaaye ||Entho||

Paralokamunu Vidachi Manuja Kumaarudavayye
Narula Baandhavudayyaa Karunaa Samudrundu ||Entho||

Baaludayya Thana Janakuni – Pani Nerigina Vaadayye
Ee Lokapu Jananee Janakulakentho Lobadane ||Entho||

Perigenu Gnaanamandu – Mariyu Deha Balamandu
Parameshuni Dayayandu Narula Kanikaramandu ||Entho||