రండో రారండో యేసుని చూడగను

Rando Rarando

Unknown

Writer/Singer

Unknown

రండో రారండో యేసుని చూడగను
రండో రారండో ప్రభుయేసుని చేరగను (2)
పరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెను
పశువుల తొట్టిలో దీనుడై మనలను
హెచ్చించెను
ఆరాధిద్దామా ఆనందిద్దామా
ఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా (2)రెండో

చరణం:1
భువిలోన ప్రతిమనిషి రక్షణ కోసం
కనులెత్తి ఆకాశం చూస్తుండగా
అక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూ
పరుగెత్తి పరుగెత్తి అలసియుండగా

లోకాన్ని రక్షింప పసిబాలుడై
మనమధ్య నివసించెను (2)
మార్గం యేసయ్యే సత్యం యేసయ్యే
జీవం యేసయ్యే నా సర్వం యేసయ్యే(2)

చరణం:2
గురిలేని బ్రతుకులో గమ్యం కోసం
అడుగడుగునా ముందుకు వేస్తుండగా
విలువైన సమాధానం ఎక్కడుందని
ప్రతిచోట ఆశతో వెదకుచుండగా

శాంతి సమాధానం మనకివ్వగా
లోకాన ఏతెంచెను(2)
నెమ్మది వచ్చింది సంతోషం వచ్చింది
రక్షణ వచ్చింది నిత్యజీవం వచ్చింది(2)